UPDATED 22nd OCTOBER 2018 MONDAY 9:00 PM
సామర్లకోట: రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు గుర్తించారు. సామర్లకోట రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ విజయకుమార్ తెలిపిన వివరాల ప్రకారం పిఠాపురం రైల్వేగేటు సమీపంలో రైలు పట్టాలపై గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించామని, మృతుడి వయస్సు సుమారు 40 నుంచి 45 సంవత్సరాలు ఉంటాయని, రైలు నుంచి జారిపడడం వల్ల బలమైన గాయాలు తగిలి మృతి చెంది ఉండొచ్చని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.







