హుస్సేన్ పురంలో ఆనందలహరి

UPDATED 8th OCTOBER 2018 MONDAY 9:00 PM

సామర్లకోట: మండలంలోని హుస్సేన్ పురం మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలో ఆనందలహరి విద్యాభోధన కార్యక్రమాన్ని సోమవారం జెడ్పీటీసీ సభ్యురాలు గుమ్మళ్ళ విజయలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాలలో ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణంతో విద్యార్థులకు చక్కని విద్య అందుతుందని అన్నారు. పాఠశాలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడానికి సహకరించిన దాతలు సుబ్రహ్మణ్యం, అరుణ దంపతులను ఆమె ఘనంగా సత్కరించారు. తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు చల్లా బుజ్జి ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే అత్యాధునిక విద్యా భోధన అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గోపాలకృష్ణ, సుబ్బారావు, పద్మావతి, కామరాజు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us