మానసిక ఒత్తిడిని జయించే సాధనమే యోగా

* ప్రతీరోజూ యోగాను అలవాటు చేసుకోవాలి
* క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి  
* ఆదిత్యలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

UPDATED 21st JUNE 2019 FRIDAY 9:00 PM

గండేపల్లి: మానసిక ఒత్తిడిని జయించే సాధనమే యోగా అని ఆదిత్య క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మానసిక, శారీరక ఆరోగ్య ప్రదాయని మానవాళికి యోగా ఒక అపూర్వ కానుక అన్నారు. రాష్ట్రం, దేశంలోనే కాకుండా అన్ని దేశాలలో నేడు యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని అన్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు యోగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ప్రతీ రోజూ యోగాను ఒక అలవాటుగా మార్చుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫార్మసీ కళాశాలల డైరెక్టర్ డాక్టర్ కె. రవిశంకర్, ప్రిన్సిపాల్స్ డాక్టర్ టికె రామకృష్ణారావు, డాక్టర్ ఆదిరెడ్డి రమేష్, డాక్టర్ ఎన్. రవిశంకర్, డాక్టర్ డి. ఆస్థాశర్మ, డాక్టర్ శరభోజీ, ఇ. మోహన్, ఎస్.టి.వి.ఎస్. కుమార్, ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్స్ శివకుమార్, జ్ఞానవర్జిన్, భాస్కర్, బాలమోహన్, ఎం. సోమిరెడ్డి, ఆశపు కార్తీక్ కుమార్, ప్రవీణ్ తోరాటి, పిఆర్ఓ తోటకూర గంగాధర్, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్స్ రఘునాధ్, సూర్యతేజ, ఫిజికల్ డైరెక్టర్లు, హాస్టల్ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

  

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us