UPDATED 20th AUGUST 2017 SUNDAY 9:00 PM
నంద్యాల: భారతదేశం గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ అని ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ పెదిరెడ్డి ప్రదీప్ అన్నారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ 73 వ జయంతి వేడుకలను స్థానిక కాంగ్రెస్ ఎలక్షన్ క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశాన్ని అన్నిరంగాల్లో ముందుకు తీసుకువెళ్లిన ఘనత ఆయనకు దక్కుతుందన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాలను భారతదేశానికి పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి రాజీవ్ గాంధీ అని కొనియాడారు. భారతదేశాన్నిఅగ్రస్థానంలో ఉంచిన మహోన్నత వ్యక్తిగా చరిత్రలో నిలిచారన్నారు. అనంతరం పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ ఇంచార్జిలు అబ్రహం రాయ్ మణీజీ, ఊట్ల వర ప్రసాద్, వర్మ అంగా తదితరులు పాల్గొన్నారు.







