UPDATED 27th FEBRUARY 2018 TUESDAY 5:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో మార్చ్ 2,3,4 తేదీల్లో జేఎన్టీయూకే మహిళల స్పోర్ట్స్, గేమ్స్ మీట్ నిర్వహించనున్నట్లు ఆదిత్య విద్యా సంస్థల వైస్ ఛైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ పోటీలకు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది జిల్లాలకు చెందిన పలు కళాశాలలకు చెందిన సుమారు 2500 మంది విద్యార్థులు హాజరవుతారని చెప్పారు. ఇప్పటికే 56 కళాశాలలకు చెందిన విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకున్నట్లు చెప్పారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ క్రీడా పోటీల్లో బాస్కెట్ బాల్, బాడ్మింటన్, షటిల్, ఖోఖో, కబాడీ, టేబుల్ టెన్నీస్, త్రో బాల్, వాలీ బాల్, చెస్,మొదలయిన అంశాల్లో క్రీడాకారులు తలపడతారని తెలిపారు. అలాగే జేఎన్టీయూకే ఇంటర్ కాలేజెస్ అథ్లెటిక్ మీట్ కు పురుషులు, మహిళలు హాజరవుతారని, దీనిలో భాగంగా రన్నింగ్, త్రోస్, జంపింగ్, అంశాలు ఉంటాయన్నారు. రాష్టంలో గల క్రీడాకారులు హాజరవుతారన్నారు. ఈ కార్యక్రమంలో క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్స్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, మీట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ సి.హెచ్. మురళీ మోహన్, కళాశాల వ్యాయామ అధ్యాపక బృందం పాల్గొన్నారు.







