UPDATED 31st JULY 2019 WEDNESDAY 9:00 PM
సామర్లకోట: సామర్లకోట పట్టణంలో స్థానిక దేవాంగుల వీధిలో వేంచేసి ఉన్న చౌడేశ్వరీ సమేత రామలింగేశ్వరస్వామి వారి ఆలయంలో చౌడేశ్వరి అమ్మవారి జన్మ నక్షత్ర పూజలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి,అమ్మవార్లకు రుద్రాభిషేకం, అభిషేకాలు, సామూహిక కుంకుమార్చనలు వైభవంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాంగుల సంఘ కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు, తదితరులు పాల్గొన్నారు.







