ప్రకాశం పంతులు ఆదర్శాలను కొనసాగించాలి

UPDATED 23rd AUGUST 2018 THURSDAY 9:00PM

సామర్లకోట: ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఆశయాలను, ఆదర్శాలను కొనసాగించాలని, ఆయన నిరాడంబరతను స్ఫూర్తిగా తీసుకొని ప్రతీ ఒక్కరూ ఆచరిస్తూ ముందుకు సాగాలని టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షుడు చల్లా బుజ్జి అన్నారు. సామర్లకోట మండలం హుస్సేన్ పురం పంచాయతీ కార్యాలయంలో గురువారం టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చల్లా బుజ్జి మాట్లాడుతూ స్వాతంత్య్రోద్యమంలో టంగుటూరి పాత్ర కీలకమైందని, ప్రకాశం పంతులు జీవితంలో సాధించిన విజయాలను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది ఎం. నారాయణమూర్తి, ఆరోగ్యమిత్ర రత్నకుమారి, పాఠశాల హెచ్ఎం సత్తార్, చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us