ప్రగతిలో నేషనల్ ఎనర్జీ కన్సర్వేషన్ డే

UPDATED 14th DECEMBER 2018 FRIDAY 5:30 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల మెకానికల్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో నేషనల్ ఎనర్జీ కన్సర్వేషన్ డే కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు పాల్గొని ఎనర్జీ కన్సర్వేషన్ ఉపయోగాలు, భవిష్యత్తులో ఎనర్జీ కన్సర్వేషన్ విలువ గురించి వివరించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.శంభుప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులలో వికాసం పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎనర్జీ కన్సర్వేషన్ అనే అంశంపై పేపర్ ప్రెజంటేషన్లు, పోస్టర్ ప్రజెంటేషన్లు, డ్రాయింగ్ ఈవెంట్స్ నిర్వహించారు. మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ పి. కుమార్ బాబు, ప్రొఫెసర్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ డాక్టర్ బి.ఎస్.వి. రామారావు, అసిస్టెంట్ ప్రొఫెసర్ జి. అవినాష్, అసోసియేట్ ప్రొఫెసర్ సిహెచ్. వసంతలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్లుగా ఎలక్ట్రికల్ &ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎస్. వరలక్ష్మి, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ కె.ఎస్. వరప్రసాద్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరక్టర్ ఎం.వి. హరనాధబాబు, డైరక్టర్ డాక్టర్ జి. రఘురాం, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. సత్యనారాయణ, డీన్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ జి. నరేష్, వివిధ విభాగాధిపతులు, సీనియర్ అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us