UPDATED 29th SEPTEMBER 2019 SUNDAY 9:00 PM
సామర్లకోట(రెడ్ బీ న్యూస్): భారత కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకులు, కార్మిక ఉద్యమ నాయకుడు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ కామ్రేడ్ మలిపిరెడ్డి సన్యాసిరావు(90) మృతి చెందారు. కమ్యూనిస్టు పార్టీ కోసం, కార్మికుల ఉద్యమాల కోసం ముందుండి పని చేయడంలోనూ నిరాడంబరుడు నిబద్ధత కలిగిన నాయకుడుగా కామ్రేడ్ సన్యాసిరావు అందరి మన్ననలను పొందారు. 1952లో కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం పొందిన సన్యాసిరావు తన జీవిత కాలంలో ఎక్కువ సమయాన్ని కమ్యూనిస్టు పార్టీ కోసం కార్మికుల ఉద్యమాల కోసం పని చేశారు. కామ్రేడ్ సన్యాసిరావు భౌతికకాయం వద్ద కమ్యూనిస్టు పార్టీ నాయకులు పెద్దిరెడ్డి సత్యనారాయణ, చల్లపల్లి మాధవరావు, వెలిశెట్టి రామదాసు. తిక్కరెడ్డి వెంకటేశ్వరరావు తదితరుల ఆధ్వర్యంలో ఎర్రజెండా కప్పి పూలమాలలు ఉంచి ఘన నివాళులు అర్పించారు. అంతిమ యాత్రలో భాగంగా జోహార్ కామ్రేడ్ మలిపిరెడ్డి, రెడ్ సెల్యూట్ కామ్రేడ్ అంటూ నినదిస్తూ అంతిమ యాత్రను పాత పోలీస్ స్టేషన్, తదితర ప్రాంతాల మీదుగా కొనసాగించారు. కామ్రేడ్ సన్యాసిరావుకు నివాళులు అర్పించిన వారిలో ఎఐటియుసి నాయకులు ఉప్పలపాటి చంద్రదాస్, పెద్దిరెడ్డి అర్జునరావు, ప్రజా నాట్యమండలి నాయకులు మడగల రమణ, అడపా చిట్టిబాబు, పోతుల బాపిరాజు, ఎస్. గురవయ్య బుల్లి సత్తి సత్యన్నారాయణ, తదితరులు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.







