UPDATED 30th SEPTEMBER 2018 SUNDAY 9:00 PM
సామర్లకోట: పెద్దాపురం నియోజకవర్గ స్థాయిలో వివిధ క్యాటగిరీలలో నిర్వహించిన సిఎం కప్ క్రీడా పోటీల్లో స్థానిక బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి జిల్లాస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల వ్యాయమ ఉపాధ్యాయులు తాళ్ళూరి వైకుంఠం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖో-ఖో విభాగంలో అండర్- 17 బాలికల విభాగంలో బి. శాంతి, బాలుర విభాగంలో డి. గణేష్, వై. వెంకటేష్, వెంకట్, ఆర్. అశోక్ ఎంపికైనట్లు తెలిపారు. అలాగే అండర్-14 బాలికల విభాగంలో డి. భాగ్య, కీర్తిలక్ష్మి, కబడ్డీ విభాగంలో డి. వీరదుర్గ, పి. దుర్గాప్రసాద్, శివకాశి ఎంపికైనట్లు తెలిపారు. ఎంపికైన విద్యార్థులను పాఠశాల హెచ్ఎం తోటకూర సాయిరామకృష్ణ, ఉపాధ్యాయ బృందం, తదితరులు అభినందించారు.







