జెసిఐతో గైట్ అవగాహనా ఒప్పందం

UPDATED 7th JULY 2018 SATURDAY 9:00 PM

రాజానగరం: గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (గైట్) కళాశాల డిపార్ట్ మెంట్ ఆఫ్ మేనేజ్ మెంట్ (డిఎంఎస్) విభాగం, రాజమహేంద్రవరంలో జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ (జెసిఐ)తో అవగాహనా ఒప్పందం చేసుకున్నట్లు గైట్ డిఎంఎస్ విభాగం డైరెక్టర్ డాక్టర్ పి.ఆర్.కె. రాజు తెలిపారు. గైట్ కళాశాలలో శనివారం జరిగిన కార్యక్రమంలో డైరెక్టర్ డాక్టర్ పి.ఆర్.కె. రాజు, జెసిఐ ప్రెసిడెంట్ కీర్తి కొఠారిలు అవగాహనా ఒప్పందాలను పరస్పరం అందిపుచ్చుకున్నారు. ఈ ఎంవోయూ వల్ల తమ విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, శిక్షణా తరగతులు, దేశంలోని ప్రముఖ వ్యక్తులతో ఇంటర్వ్యూలు వంటి అవకాశాలు జెసిఐ నుంచి లభిస్తాయన్నారు. ఈ సందర్భంగా జెసిఐ ప్రెసిడెంట్ కీర్తి కొఠారి, జెసిఐ బృందం వనజా రవిచంద్ర, రవిచంద్రలు విద్యార్థులకు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. జీవితంలో విజయం సాధించడానికి జ్ఞానంతో పాటు నైపుణ్యం, సరైన వైఖరి అవసరమని అన్నారు. దీంతో జీవిత లక్ష్యా నిర్దేశం కూడా ఇందులో ప్రాముఖ్యత వహిస్తుందన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విజయం దిశగా పయనించేందుకు అనుసరించాల్సిన పద్ధతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గైట్ ఎంబిఎ విద్యార్థులు, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us