కర్రసాములో శ్రీ ప్రకాష్ విద్యార్ధిని ప్రతిభ

UPDATED 23rd OCTOBER 2019 WEDNESDAY 8:00 PM

పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): స్థానిక రామారావుపేటలో గల శ్రీ ప్రకాష్ సినర్జీ పాఠశాల ఏడవ తరగతి విద్యార్థిని పి. హిరణ్య కర్రసాము(సిలంబం)లో విశేష ప్రతిభ కనబరుస్తున్నట్లు పాఠశాల డైరెక్టర్ సిహెచ్ విజయప్రకాష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెలలో కడప జిల్లా శంఖరపురంలో జరిగిన రాష్ట్రస్థాయి కర్రసాము పోటీలలో డబుల్ స్టిక్ అండర్-14 విభాగంలో పాల్గొని, ఢిల్లీలో నవంబర్ నెలలో జరిగే జాతీయస్థాయి కర్రసాము పోటీలలో పాల్గొనేందుకు ఎంపికైందని అన్నారు. కర్రసాము విద్యలో ప్రసిద్ధి పొందిన శ్రీనివాస్ తమ పాఠశాల విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల సివోవో లెఫ్టినెంట్ కమాండర్ కె.ఎస్.రావు, అకడమిక్ కోఆర్డినేటర్స్, ఉపాధ్యాయులు హిరణ్యను అభినందించారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us