UPDATED 28th DECEMBER 2017 THURSDAY 5:30 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో గూగుల్ ఆండ్రాయిడ్ డవలపర్ ఫండమెంటల్స్ అనే అంశంపై మూడురోజులు వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లు ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ సి.ఎస్.ఇ, ఐ.టి., ఎం.సి.ఏ విభాగం ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (APSSDC) సౌజన్యంతో ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు వ్యవస్థాపకత, నూతన ఆవిష్కరణలపై విద్యార్థులకు అవగాహన, శిక్షణ ఇచ్చే విధంగా ఈ వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. తృతీయ సంవత్సరం సి.ఎస్.ఇ, ఐ.టి., ఎం.సి.ఏ. విద్యార్థులు ఈ వర్క్ షాప్ లో పాల్గొనవచ్చన్నారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.కె.రామకృష్ణారావు మాట్లాడుతూ కంప్యూటర్ సైన్స్ విభాగంలో శరవేగంగా మారుతున్న నూతన ఆవిష్కరణలు గురించి విద్యార్థులు ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొని ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ , విజయవాడ ప్రతినిధులు టి.పవన్ కుమార్, ట్రైనీ అండ్ డవలపర్ సి.నవీన్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ ఎ. రామకృష్ణ, హెచ్.ఓ.డి లు,తదితరులు పాల్గొన్నారు.







