UPDATED 4th JANAURY 2019 FRIDAY 6:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో ఉన్నత భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కొండపల్లి, సింగంపల్లి, పి.నాయకంపల్లి గ్రామాల్లో ఇంటింటి సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వాలంటీర్లు గ్రామంలో పర్యటించి ఇంటింటికి వెళ్ళి గ్రామస్థుల స్థితిగతులు, సౌకర్యాలు, సమస్యలు వంటి విషయాలపై సమగ్ర సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఉన్నత భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆదిత్య ఎన్ఎస్ఎస్ దత్తత గ్రామాల్లో సర్వే నిర్వహిస్తున్నామని, ఈ సర్వేలో 70మంది వాలంటీర్లు పాల్గొని ఆయా గ్రామాల్లో గల ప్రజల స్థితిగతులు, ఆర్ధిక, సామాజిక అంశాలపై నివేదిక తయారు చేస్తారని తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న వాలంటీర్లను ఆదిత్య క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు శివకుమార్, జ్ఞానవర్జిన్, విద్యార్థులు పాల్గొన్నారు.







