UPDATED 12th OCTOBER 2018 FRIDAY 7:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య బిజినెస్ స్కూల్ కళాశాలకు చెందిన వార్తాలేఖ (న్యూస్ లెటర్) 'అభిగ్యాన్" గురువారం కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ కళాశాలలో జరిగిన వివిధ అంశాలను పుస్తక రూపంలో ప్రచురించి ఆవిష్కరించామని అన్నారు. వివిధ కంపెనీలకు ఎంపికైన తమ సంస్థ విద్యార్థుల సమాచారం, వారి వార్షిక వేతనాలు, అధ్యాపక అభివృద్ధి కార్యక్రమాలు, ప్యానల్ చర్చలు, మహిళా పారిశ్రామిక దినోత్సవ కార్యక్రమం, ఎన్ఎస్ఎస్, స్వచ్ఛభారత్, సెమినార్లు, చర్చలు, వర్క్ షాపులు, పారిశ్రామిక సందర్శనలు వంటి కార్యక్రమాల వివరాలను ఇందులో పొందుపరిచినట్లు తెలిపారు. అలాగే అధ్యాపకుల విజయాలు, ప్రతిభ కనబరిచిన విద్యార్థుల సమాచారంతో పాటు విద్యార్థుల విజయాలు, కళాశాలో నిర్వహించిన ఈవెంట్లులో పాల్గొని విజేతలుగా నిలిచిన విద్యార్థుల వివరాలతో పాటు నీతికధలు, ఫ్రెషర్స్ డే, వీడ్కోలు సమాచారం ఇందులో పొందుపరిచామని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. ఆస్థాశర్మ, అధ్యాపకులు కె. శైలజారావు, వి. అప్పలకొండలు, డి. విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.







