UPDATED 17th OCTOBER 2018 WEDNESDAY 5:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య డిగ్రీ కాలేజ్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఫోరెన్సిక్ మెటాఫోర్స్ అనే అంశంపై పోస్టర్ ప్రెజెంటేషన్ కాంటెస్ట్-2018 పోటీలను ఆదిత్య బిజినెస్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేరాలు, వాటి పర్యవసానాలపై ఫోరెన్సిక్ శాస్త్రంపై అవగాహన విద్యార్థులకు ఒక మంచి వేదికగా ఉపయోగపడుతుందని అన్నారు. ఫోరెన్సిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఇ. మోహన్ మాట్లాడుతూ ఫోరెన్సిక్ సైన్స్ రంగంలో నైపుణ్యం, జ్ఞానం ఉపయోగించి వినూత్నమైన, పరిశోధనాత్మక ఆలోచనలను అత్యుత్తమ ప్రదర్శనలతో ప్రజ్ఞాపాటవాలను ప్రదర్శించడానికి విద్యార్థులకు చక్కటి వేదిక అన్నారు. విద్యార్థులు సమర్పించిన పోస్టర్స్ పరిశీలించిన ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆస్థాశర్మ, డాక్టర్ ఎన్. విశాలాక్షి న్యాయనిర్ణేతలు బృందం మొత్తం 32 పోస్టర్స్ నుంచి ఉత్తమ పోస్టర్స్ కు ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాలకు నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలను ప్రధానం చేశారు. పోటీలో పాల్గొన్న విద్యార్థులకు పార్టిసిపేట్ సర్టిఫికెట్లు, యోగ్యతా పత్రాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.







