రాజీనామాల పేరుతో వైసీపీ దొంగాట ఆడుతోంది

UPDATED 10th APRIL 2018 TUESDAY 9:00 PM

పెద్దాపురం: రాజీనామాల పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  దొంగాట ఆడుతోందని రాష్ట్ర క్రీడల శాఖామంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో మంగళవారం అయన మాట్లాడుతూ కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడతామని బయట ఒకలా మాట్లాడి లోపల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాళ్లు పట్టుకుంటున్నారని విమర్శించారు. అవిశ్వాసానికి కేవలం ఐదు మంది ఎంపీలతో మాత్రమే వైసిపి దొంగాట ఆడుతున్నట్లు పేర్కొన్నారు. కేంద్రంపై అవిశ్వాసానికి ముఖ్యమంత్రి  చంద్రబాబు ముందుకు వెళ్లడం జరిగిందని, అవిశ్వాసం పెట్టాలంటే 50 మంది ఎంపీల మద్దతు కావాలని, అయితే ముఖ్యమంత్రి  చంద్రబాబు పిలుపునిస్తే దాదాపు 15 పార్టీలకు చెందిన సుమారు 200 మంది ఎంపీలు కేంద్రంపై అవిశ్వాసానికి సంతకాలు చేశారని, ఆ ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాత్రమే దక్కుతుందన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్ర ప్రదేశ్ కి దక్కకుండా బిజెపి ప్రభుత్వం వైసిపి, జనసేనతో కలిసి దొంగ నాటకాలు ఆడుతూ లభ్ధి పొందాలని చూస్తే వచ్చే ఎన్నికల్లో మీ ఆడ్రస్ గల్లంతుకావడం తథ్యం అన్నారు. జగన్ ప్రధానమంత్రి మోడీపై ఒక్కమాట కూడా మాట్లాడరని, కేసుల కోసం భయపడి లాలూజీ రాజకీయాలు చేస్తున్నట్లు ఆరోపించారు. అలాగే జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ కూడా రాష్ట్ర పరిస్థితులపై ఒక్కరోజులోనే మాట మార్చారన్నారు. కేవలం రాజకీయ స్వార్ధం కోసమే చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటుపడే ఏకైక పార్టీ టిడిపి అని ఆయన అన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us