• ఎంపీడీవో అబ్బిరెడ్డి రమణారెడ్డి
• చంద్రమాంపల్లిలో ఘనంగా ప్రారంభమైన రాష్ట్రస్థాయి నాటిక పోటీలు
UPDATED 24th JANUARY 2020 FRIDAY 10:30 PM
పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): నాటక రంగాన్ని బతికించుకోవాల్సిన అవసరం నేటి సమాజంపై ఎంతైనా ఉందని పెద్దాపురం ఎంపీడీవో అబ్బిరెడ్డి రమణారెడ్డి అన్నారు. స్నేహా ఆర్ట్స్ నాటక పరిషత్ అధ్యర్యంలో మండల పరిధిలోని చంద్రమాంపల్లి గ్రామంలో ఈనెల 24 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించనున్న రాష్ట్రస్థాయి నాటికల పోటీలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సీనియర్ కళాకారులు టిల్లపూడి వాసు, ప్రసాదమూర్తి చిత్ర పటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ మంచి సమాజాన్ని నిర్మించుకోవడానికి కళలు, నాటకాలు ఎంతో దోహదపడతాయని, మానవతా విలువలకు ప్రతిరూపమే నాటకాలన్నారు. నాటకం జీవితాన్ని ప్రతిబింబిస్తే, జీవితాన్ని నాటకంగా మనముందు ఉంచుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో జీవన విధానాలు, సామాజిక సంబంధాలను నాటకాలు, కళారూపాల ద్వారా వ్యక్తపరిచాయని అన్నారు. నాటక పరిషత్ క్రమం తప్పకుండా నిర్వహించాలని ఆయన నిర్వాహకులను కోరారు. ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు గోగులపాటి సీతారామస్వామి, అధ్యక్షుడు గొందేసి రాజా, ఉపాధ్యక్షుడు ఇంధన బ్రహ్మానందం, దేవాడ పాపేశ్వరరావు, కేదారి నాగేశ్వరరావు, సత్తిబాబు, మానేపల్లి రవీంద్ర, గొందేసి సత్యానందం, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అలాగే ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా జి.ఎస్.ఆర్. స్వామి, సీఎస్ మూర్తి వ్యవహరించారు.
మహిళల చారిత్రక ఇతివృత్తమే లేడీ పంజా..
పులి చంపిన లేడి నెత్తురు విన్నాం. పులిపై తిరగబడి పంజా విసిరిన లేడి పంజాను ఉక్కు
నగరం కళాకారులు ప్రదర్శించారు. ఎంవీఎస్ హరినాథరావు రచించిన పురాణ, ఇతిహాసాల నుంచి కొన్ని పాత్రలను సామాజిక ఇతివృత్తంలో ఉదహరించారు. నాటకం రాసిన రచయిత చెప్పే అభ్యుదయం, ఆచరణలో కనబడకపోతే జరిగే పరిణామాలను కళ్లకు కట్టినట్లు చూపించారు.







