UPDATED 1st JANUARY 2019 TUESDAY 9:00 PM
సామర్లకోట: జనసేన పార్టీ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో గల పెద్దాపురం మండలం పులిమేరు గ్రామంలో పార్టీ నియోజకవర్గ నాయకులు తుమ్మల రామస్వామి(బాబు) ఆధ్వర్యంలో 2019 నూతన సంవత్సర వేడుకలు మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి నియోజకవర్గ పరిధిలో గల సుమారు ఇరవై వేల మంది పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో భారీ కేకును తుమ్మల రామస్వామి కట్ చేసిన అనంతరం 2019 జనసేన నూతన క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి మాట్లాడుతూ ప్రతీ కార్యకర్త జనసేన విజయం కోసం పాటుపడాలని, పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అలాగే పార్టీ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ వీరమహిళ మాకినీడి శేషుకుమారి, పిఠాపురం వీరమహిళ చల్లా లక్ష్మి, సుంకర కృష్ణవేణి, పెంకే వెంకటలక్ష్మి, వడ్డాది దుర్గాదేవి, విజయలక్ష్మి, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.







