మైనర్లపై అత్యాచారాలకు నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ

UPDATED 14th APRIL 2018 SATURDAY 9:00 PM

సామర్లకోట: ఉత్తరప్రదేశ్, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాలలో మైనర్లపై జరిగిన ఆత్యాచారాలకు నిరసనగా స్థానిక గాంధీనగర్ లో గాంధీ విగ్రహం వద్ద ఐద్వా ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా అధ్యక్షురాలు వరలక్ష్మి మాట్లాడుతూ స్త్రీలను దేవతగా కొలిచే మనదేశంలో ఇలాంటి సంఘటనలు జరిగినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు లేదన్నారు. చట్టాలు ఎన్ని చేసినా వాటిని పటిష్టంగా అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం అయిందన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా పట్టణ అధ్యక్షురాలు బి. లక్ష్మి, ఐద్వా నాయకులు ఎం.వి. రమణమ్మ, బి రామలక్ష్మి, బి. దుర్గ, డి. పద్మ, మంచిర్యాల దుర్గ, పి. కనకదుర్గ, కె. గంగ, బాలం శ్రీనివాస్, బి.చరణ్, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us