పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) 14 డిసెంబరు 2021: దేవాదాయశాఖ ఆదేశాల మేరకు మండల పరిధిలో పలు దేవస్థానాలకు సంబంధించి ధర్మకర్తల మండలి నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కార్యనిర్వహణాధికారి కాట్నం జగన్మోహన శ్రీనివాస్ తెలిపారు. దీనిలో భాగంగా కట్టమూరు కేశవ, పట్టాభిరామస్వామి దేవస్థానం, ఉలిమేశ్వరం ఉమా మహేశ్వరస్వామి దేవస్థానం, పెద్దాపురం పట్టణంలో విశ్వేశ్వర చంద్రశేఖర స్వామి దేవస్థానం, వెంకటేశ్వరస్వామి దేవస్థానం, సీతారామస్వామి దేవస్థానాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. అర్హత గల అభ్యర్థులు 20 రోజుల్లోగా ఉప కమీషనర్ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







