UPDATED 22nd SEPTEMBER 2017 FRIDAY 6:30 PM
తొండంగి: మన భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించుకోవాలని రాష్ట్ర ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం ఏ.వి.నగరంలో శ్రీదేవీ, భూదేవీ సమేత కళ్యాణ వేంకటేశ్వరుని ఆలయ ప్రాంగణంలో శరన్నవరాత్రి వేడుకలను ఆయన శుక్రవారం ప్రారంభించారు. ముందుగా మంత్రి సతీసమేతంగా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అనాదిగా వస్తున్న మన ఆచార సాంప్రదాయాలను కాపాడుకోవాలని, ముఖ్యంగా విజయదశమి పండుగను ప్రతీ ఒక్కరు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, అలాగే ఆధ్యాత్మిక భావాలను పెంపొందించుకోవాలన్నారు. ఈ నెల 27 న మూలా నక్షత్రం కావడంతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు.







