దళిత గిరిజన సింహగర్జన విజయవంతం చేయాలి

UPDATED 5th JUNE 2018 TUESDAY 9:00 PM

సామర్లకోట: వరంగల్ లో ఈ నెల 10వ తేదీన జరగనున్న దళిత సింహగర్జనను విజయవంతం చేయాలని పెద్దాపురం నియోజకవర్గ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోఆర్డినేటర్ లింగం శివప్రసాద్ అన్నారు. స్థానిక బ్రౌన్ పేట అంబేద్కర్ పార్కులో నియోజకవర్గ సమావేశం మంగళవారం నిర్వహించారు. అనంతరం దళిత సింహగర్జన పోస్టర్ ను ఆవిష్కరించారు. దళితుల ఐకమత్యాన్ని చాటేవిధంగా చలో వరంగల్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పలువురు నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో వల్లూరి నాని, నిడిగట్ల వెంకటరావు, వల్లూరి సత్యవతి, చక్రం, నీలం నాగేంద్ర ప్రసాద్, వర్దనపు లోవరాజు, చొల్లంగి బాబి, కొల్లి చైతన్య కుమార్, మందపల్లి వెంకన్న, అందుగుల రామకృష్ణ, గొల్లపల్లి కుమార్, నాని, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us