UPDATED 6th AUGUST 2018 MONDAY 9:00 PM
సామర్లకోట: ఎస్సీ,ఎస్టీ చట్టాన్ని రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఎమ్మార్పీఎస్ నాయకులు సోమవారం అధిక సంఖ్యలో ఢిల్లీ తరలివెళ్లారు. ఎస్సీ ఎస్టీ పరిరక్షణ కమిటీ చైర్మన్ మందా కృష్ణమాదిగ పిలుపు మేరకు ఈ నెల ఎనిమిదవ తేదీన ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో జరిగే సింహగర్జన సదస్సుకు తరలి వెళ్తున్నట్లు స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లో వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు వల్లూరి సత్యవతి, వల్లూరి నాని, దూళ్లపల్లి శ్రీను, కాళ్ల లక్ష్మీనారాయణ, వల్లూరి అర్జున్, బాట్ల ప్రసాద్, వల్లూరి చంటి, డోకుబుర్ర రాజు, చేవేటి వినోద్ కుమార్, మల్లెల దుర్గా ప్రసాద్, కాతేటి ఏసు, గొడత అన్నవరం, మోరంపూడి సూరిబాబు, అధిక సంఖ్యలో కార్యకర్తలు ఢిల్లీకి పెద్ద ఎత్తున తరలివెళ్లారు.







