UPDATED 18th JUNE 2019 TUESDAY 5:30 PM
పెద్దాపురం: స్థానిక జవహర్ నవోదయ విద్యాలయానికి వివిధ వస్తువులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ పెద్దాపురం ఆర్డీవో ఎన్.ఎస్.వి.బి. వసంతరాయుడు సమక్షంలో మంగళవారం ఉదయం జరిగింది. ముందుగా జవహర్ నవోదయ ప్రిన్సిపాల్ డాక్టర్ వి. మునిరామయ్య, మహారాణి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి. వీరయ్య చౌదరి, డిఈవో కార్యాలయం ఎడి ఛాయాదేవి సమక్షంలో టెండరు ప్రక్రియ ప్రారంభించారు. 28 ఐటమ్స్ కు పబ్లిష్ చేయగా 17 ఐటమ్స్ కు సంబంధించి 48 దరఖాస్తులు వచ్చినట్లు జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ ప్రిన్సిపాల్ డాక్టర్ మునిరామయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం తహసీల్దార్ కె. గోపాలకృష్ణ, డిప్యూటీ తహసీల్దార్ టి. కృష్ణారావు, టెండర్లు వేసిన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.







