* రాజమహేంద్రవరం ఎంపీ భరత్ రామ్
UPDATED 22nd JUNE 2020 MONDAY 6:00 PM
రాజమహేంద్రవరం(రెడ్ బీ న్యూస్): కరోనాపై ప్రజలను మరింత చైతన్యపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ రామ్ పేర్కొన్నారు. స్థానిక ఆనంద నగర్ అర్బన్ హెల్త్ సెంటర్లో ఏర్పాటు చేసిన క్యూయోస్కోను ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ రామ్ మాట్లాడుతూ అన్ని ప్రాంతాల వారికి అందుబాటులో ఉండే విధంగా అర్బన్ హెల్త్ సెంటర్లలో కరోనా నిర్ధారణ పరీక్షల కోసం నగరపాలక సంస్థ అందిస్తున్న ఈ సేవలను సద్వినియోగం చేసుకొని స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. దేశంలో ప్రతి రోజూ 10 నుండి 15 వేలు వరకూ కేసులు పెరుగుతున్నాయని, కుటుంబ సభ్యుల క్షేమం కోసం అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సబ్ కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ మాట్లాడుతూ కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలకు ఇకపై ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లకుండా నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న అర్బన్ ప్రాథమిక హెల్త్ సెంటర్లలో నమూనాలు సేకరణకు క్యూయోస్కోలను నగరపాలక సంస్థ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. సబ్ కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ మాట్లాడుతూ నగర పరిధిలో 8 అర్బన్ హెల్త్ సెంటర్లలో ఈ కోవిడ్-19 నిర్థారణ పరీక్షలు ఉచితంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. అర్బన్ హెల్త్ సెంటర్లో పరీక్షలు చేయించుకునేందుకు ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్లతో రావాలని, కేవలం ఐదు నిమిషాల్లో నమూనాలు సేకరించడం జరుగుతుందని ఆయన తెలిపారు. అలాగే కళాజాతాలతో ప్రజలకు కరోనా వైరస్ పై అవగాహనా కల్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమీషనర్ ఎన్.వి.వి. సత్యనారాయణ, డిప్యూటీ డిఎం&హెచ్ఓ డాక్టర్ కోమల, కార్పోరేషన్ ఎంహెచ్ఓ డాక్టర్ వినూత్న, అదనపు ఎంహెచ్ఓ డాక్టర్ మూర్తి, జాంపేట కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ బొమ్మన రాజకుమార్, బీసీ సెల్ అధ్యక్షులు మజ్జి అప్పారావు, మాజీ ఫ్లోర్ లీడర్ పోలు విజయలక్ష్మి, ఆకుల విజయ, బర్రె కొండబాబు, కె. సత్య, ఎం సుబ్బారావు, అజ్జరపు వాసు, డాక్టర్ జ్యోతి, డాక్టర్ అనూహ్య, తదితరులు పాల్గొన్నారు.







