చారిత్రక పెద్దాపురం వైభవాన్ని దశదిశలా వ్యాపింపచేయాలి : ఎమ్మెల్యే చినరాజప్ప

★ చారిత్రక  పెద్దాపురం కథలు గాథలు పుస్తకావిష్కరణ

పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) 26 డిసెంబర్ 2021: పెద్దాపురం చరిత్ర వైభవాన్ని దశదిశలా వ్యాపింప చేయాలని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. స్థానిక మరిడమ్మ కళ్యాణ మండపంలో చారిత్రక పరిశోధకుడు వంగలపూడి శివకృష్ణ రచించిన ‘చారిత్రక పెద్దాపురం కథలు గాథలు’ పుస్తకాన్ని ఆయన ఆదివారం ఆవిష్కరించారు.  అనంతరం చినరాజప్ప మాట్లాడుతూ పెద్దాపురం చరిత్ర అద్దంపట్టేలా చారిత్రక పెద్దాపురం కథలు-గాథలు పుస్తకాన్ని రూపొందించడం గొప్ప విషయమన్నారు. రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దవులూరి దొరబాబు మాట్లాడుతూ మరుగున పడిపోతున్న పెద్దాపురం చరిత్రను వెలికితీసి ప్రపంచానికి చాటిచెప్పిన పుస్తక రచయిత వంగలపూడి శివకృష్ణను ఆయన అభినందించారు. ప్రముఖ కవి అద్దేపల్లి ప్రభు మాట్లాడుతూ ఎంతో ఘనమైన పెద్దాపురం చరిత్రను పుస్తక రూపంలో నిక్షిప్తం చేయడం సంతోషదాయకమని అన్నారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బొడ్డు తులసీ మంగతాయారు, వైస్‌ చైర్మన్‌ నెక్కంటి సాయిప్రసాద్‌ మాట్లాడుతూ ఈ పుస్తక రచన ద్వారా పెద్దాపురం చరిత్ర మరింతగా విస్తరిస్తుందన్నారు. పుస్తక రచయిత వంగలపూడి శివకృష్ణ మాట్లాడుతూ ‘మాఊరికి ఒక చరిత్ర ఉంది, ఘనమైన వారసత్వ సంపద ఉంది’ అని సగర్వంగా ప్రతీ ఒక్కరూ చెప్పుకునేలా ఉండాలని, భావితరాలకు సైతం పెద్దాపురం వైభవం పదిలంగా పదికాలాలపాటు గుర్తు ఉండాలన్న సదుద్దేశ్యంతో ఈ పుస్తకాన్ని రచించినట్లు తెలిపారు. అనంతరం పలువురు ప్రముఖులు ప్రసంగించారు. నాటి పెద్దాపురం వైభవాన్ని ప్రతీ ఒక్కరూ కళ్లారా తిలకించేలా ఏర్పాటు చేసిన చారిత్రక వస్తు ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ జ్యోశ్యుల కృష్ణబాబు, కార్యదర్శి పూడి శ్రీనివాస్‌, అభ్యుదయ కవి చల్లా విశ్వనాథం, మాజీ  మున్సిపల్‌ చైర్మన్‌ రాజా సూరిబాబురాజు, సాహితీప్రియులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us