రావాలి జగన్... కావాలి జగన్

UPDATED 6th OCTOBER 2018 SATURDAY 9:00 PM

సామర్లకోట : పట్టణ పరిధిలోని 23వ వార్డులో రావాలి జగన్..కావాలి జగన్ కార్యక్రమం శనివారం నిర్వహించారు. పార్టీ పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను వారికి వివరిస్తూ, నవరత్న పథకాలను వివరిస్తూ పార్టీ పధకాలపై విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇస్తూ ప్రజా సమస్యలను ఆలకిస్తూ ముందుకుసాగారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఆవాల లక్ష్మీనారాయణ, కాళ్ల లక్ష్మీనారాయణ, మద్దాల శ్రీను, సేపేని సురేష్, శెట్టిబత్తుల దుర్గ, మేకా శ్రీను, పిల్లా సురేష్, మహమ్మద్ ఉబేదుల్లా, పితాని కృష్ణ, లోవాచారి, గంపా శివ, కరణం సురేష్, డేగల భాస్కర్, మేడిశెట్టి భద్రం, గోపు మురళి, భానుప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us