క్రియేటివ్ ఆర్ట్స్ లో విద్యార్థులకు అభినందనలు

UPDATED 16th OCTOBER 2019 WEDNESDAY 9:00 PM

సామర్లకోట(రెడ్ బీ న్యూస్): క్రియేటివ్ ఆర్ట్స్ లో గోల్డ్ మెడల్స్ సాధించిన విద్యార్థులను సామర్లకోట మున్సిపల్ కమీషనర్ ఎం. ఏసుబాబు బుధవారం అభినందించారు. స్థానిక యార్లగడ్డ అక్కిరాజు మున్సిపల్ ఉన్నత పాఠశాలకు చెందిన ఏడవ తరగతి విద్యార్థినులు కె. తస్విత, జి. జాహ్నవి, ఆరవ తరగతి విద్యార్థిని పి. హర్షిణి ఆర్ట్, క్రాఫ్ట్ పోటీల్లో పాల్గొని విశేష ప్రతిభ కనబరిచి బహుమతులు సాధించడం అభినందనీయమని మున్సిపల్ కమీషనర్ అన్నారు. వీరిని ప్రోత్సహించిన క్రాఫ్ట్ ఉపాధ్యాయిని ఎం. సరస్వతికి ప్రశంసాపత్రం, అలాగే విద్యార్థినులను ప్రశంసా పత్రాలు, మెమొంటోలను ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం యు. సత్యనారాయణ, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us