UPDATED 19th JULY 2018 THURSDAY 9:00 PM
సామర్లకోట: భవన నిర్మాణ కార్మికులకు శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు సభ్యుడు గల్లా రాము తెలిపారు. స్థానిక నేషనల్ అకాడమీ ఆఫ్ కనస్ట్రక్షన్ (న్యాక్) ఆధ్వర్యంలో శిక్షణా నైపుణ్యం పెంపొందించుకునేందుకు కార్మికులకు నిర్వహిస్తున్న ఉచిత ఉపాధి శిక్షణను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం కృషి చేస్తున్నారని, శిక్షణ అనంతరం కార్మికులు ఆర్థికంగా ఎదగాలన్న ఉద్దేశ్యంతో రాష్ట్రంలో 13 జిల్లాలలో 1,21,412 మందికి శిక్షణ నిమిత్తం రూ.125 కోట్ల 38 లక్షల 85 వేల 68 రూపాయలు ఖర్చు చేయడం జారిందన్నారు. అనంతరం శిక్షణ పొందిన తాపీ, పెయింటింగ్ ఎలక్ట్రికల్, ప్లంబింగ్ కార్మికులకు 272 మందికి కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కోరుమిల్లి రఘుపతి, న్యాక్ కేంద్ర ఇంచార్జ్ జె. రాజు, ఎ.వై. ప్రసాద్, డి. వాసుబాబు, ఎం. విశ్వేశ్వరరావు, అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.







