పారిశ్రామిక అవసరాలకు సిద్ధం చేయడమే స్టూడెంట్స్ కాలేజ్ కనెక్ట్ లక్ష్యం

UPDATED 3rd AUGUST 2018 FRIDAY 9:00 PM

గండేపల్లి: విద్యార్థులను పారిశ్రామిక అవసరాలకు సిద్ధం చేయడమే స్టూడెంట్స్ కాలేజ్ కనెక్ట్ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ముఖ్యమంత్రి ఐటి సలహాదారు జె.ఏ. చౌదరి అన్నారు. గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ లో స్టూడెంట్స్ కాలేజ్ కనెక్ట్ కార్యక్రమంపై అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహించారు. ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే తరాల విద్యార్థులు ఉద్యోగ సముపార్జనలో ఎదుర్కొను సవాళ్లు, వారికి గల అవకాశాలు అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా సుశిక్షుతులైన మెంటార్స్ పరివేక్షణలో విద్యార్థుల వినూత్న ఆలోచనలు, సృజనకు పదును పెడుతూ నిరంతరం శిక్షణా తరగతులు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. మెంటార్స్ పర్యవేక్షణలో శిక్షణ పొందిన విద్యార్థులు మళ్ళీ శిక్షణ అవసరం లేకుండా ఆయా పరిశ్రమలలో పనిచేసే సామర్థ్యం కలిగి ఉండటంతో పరిశ్రమలకు కూడా ఈ కార్యక్రమం ఎంతో మేలు జరుగుతుందని, ఇటువంటి కార్యక్రమం తమ సంస్థలో ప్రారంభించినందుకు ముఖ్య అతిథికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథిని ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం టివి5 సౌజన్యంతో నిర్వహించిన స్టూడెంట్ కాలేజ్ కనెక్ట్ కార్యక్రమంలో విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు వివిధ సంస్థల ప్రతినిధులు సమాధానాలతో సాగిన కార్యక్రమం విజయవంతంగా సాగింది. ఈ కార్యక్రమంలో వివిధ సంస్థల వ్యవస్థాపకులు చరణ్, పవన్ బోడపాటి, జి. సాంబశివరావు, బ్యాంకు అఫ్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ నాగరాజు, లూప్ క్వాలిటీ సహ వ్యవస్థాపకులు జిగ్నేష్ తలశిల, క్రిఫ్ ఇన్నోవేషన్ వ్యవస్థాపకులు, సిఇ వో కృష్ణారెడ్డి కొవ్వూరు, తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్స్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, డాక్టర్  టి.కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఎ. రమేష్, తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us