UPDATED 1st AUGUST 2019 THURSDAY 9:00 PM
సామర్లకోట: సామర్లకోట పట్టణ పరిధిలో గల స్థానిక సంగీతరావుపేటలో పేకాట ఆడుతున్నారని సమాచారం అందడంతో ఎస్ఐ సుమంత్ సిబ్బందితో కలిసి గురువారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో తొమ్మిది మంది వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.23,260 నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.







