సెప్టెంబర్ నుంచి రామ్ చరణ్, శంకర్ సినిమా

రామ్ చరణ్ హీరోగా తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా షూటింగ్ ను సెప్టెంబరు నుంచి ప్రారంభిస్తామని నిర్మాత దిల్ రాజు తెలిపారు. గురువారం ఉదయం దిల్ రాజు దంపతులు తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం దిల్ రాజు ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ రౌడీబాయ్, థ్యాంక్యూ, పాగల్ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయన్నారు. కొవిడ్ కారణంగా వాటి రిలీజ్ లేటయ్యే అవకాశాలున్నాయన్నారు. ఎఫ్-3' సినిమా షూటింగ్ జరుగుతోందన్నారు. అల్లు అర్జున్ ఐకాన్ సినిమాను కూడా త్వరలో ప్రారంభిస్తామన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us