11 న ఆదిత్యలో జాతీయస్థాయి డెల్ నెట్ వర్క్ షాప్

UPDATED 9th SEPTEMBER 2017 SATURDAY 7:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల క్యాంపస్ లో ఈ నెల 11 న ఢిల్లీకి చెందిన డెల్ నెట్ ప్రతినిధుల ఆధ్వర్యంలో జాతీయస్థాయి వర్క్ షాప్ జరుగుతుందని సంస్థ వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. దేశంలోనే మొదటి సారిగా జరిగే ఈ వర్క్ షాప్ కు తమ కళాశాల వేదిక కానున్నదని, దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందన్నారు. "డెల్ నెట్ డిస్కవరీ సర్వీసెస్, ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్స్, నాలెడ్జ్ మేనేజ్మెంట్ టెక్నాలజీస్, ప్లాగారిజం" అనే అంశంపై ఈ వర్క్ షాప్ జరుగుతుందని, ఈ కార్యక్రమానికి ఇంతవరకు 156 కళాశాలలు రిజిస్టర్ అయ్యాయని, ఆధునిక పరిజ్ఞానాన్ని ప్రస్తుత సాంప్రదాయ గ్రంథాలయాలకు అనుసంధానిం చడం ద్వారా గ్రంధాలయ శాఖోపాధ్యాయులు మరింత మెరుగైన సేవలు అందించగలిగే జ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు ఇది ఒక చక్కని అవకాశమని ఆయన పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి 200 మందికి పైగా పాల్గొనే ఈ కార్యక్రమానికి డెల్ నెట్ ప్రతినిధులు హెచ్.కె.కౌల్, సంగీతా కౌల్ పాల్గొంటారని, ఈ వర్క్ షాప్ లో పాల్గొనే ప్రతినిధులకు సర్టిఫికెట్లు, వర్క్ షాప్ కిట్లు అందచేయనున్నట్లు తెలిపారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మేడపాటి  శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ప్రతినిధులు హాజరయ్యేలా సమాచారాన్ని పోస్ట్, ఫోన్, ఈమెయిల్స్ ద్వారా పంపించామని, అందుకు తగిన స్థాయిలో ఇంతవరకు 156 కళాశాలలు తమ అంగీకారాన్ని తెలియచేస్తూ రిజిస్టర్ చేసుకున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, ఫార్మసీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.  

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us