UPDATED 15th NOVEMBER 2017 WEDNESDAY 8:00 PM
గండేపల్లి: పుస్తక పఠనంతోనే జ్ఞాన సముపార్జన సాధించవచ్చని ఆదిత్య ఈఈఈ డిపార్ట్ మెంట్ రీసెర్చ్ అండ్ డవలప్మెంట్ హెడ్ డాక్టర్ కె.వి. శ్రీరామచంద్రమూర్తి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య క్యాంపస్ లో 50 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకుని ఆదిత్యలో పనిచేస్తున్న అధ్యాపక సిబ్బందికి వకృత్వ పోటీలు నిర్వహించినట్లు కళాశాలల డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించిన ఆదిత్య ఈఈఈ డిపార్ట్ మెంట్ రీసెర్చ్ అండ్ డవలప్మెంట్ హెడ్ డాక్టర్ కె.వి. శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ గ్రంథాలయాలు విద్యాలయాలకు హృదయంలాంటివని, విద్యార్థులు, అధ్యాపకులు వాటిని ఎంతవరకు ఉపయోగిస్తున్నారనే దానిపైనే వారి విలువ ఆధారపడి ఉంటుందన్నారు. అనంతరం పోటీల్లో విశేష ప్రతిభ కనబరిచిన ప్రొఫెసర్ ఎస్. జగదీష్( ఆదిత్య ఈసీఈ), ప్రొఫెసర్ విద్యాసాగర్(ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్) ప్రథమ, ద్వితీయ బహుమతులు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయాధికారి కె. అశోక్ కుమార్, సహాయ గ్రంథాలయాధికారి సి.హెచ్. వేణు, తదితరులు పాల్గొన్నారు.







