UPDATED 13th JUNE 2018 WEDNESDAY 9:00 PM
సామర్లకోట: ప్రభుత్వ పాఠశాలలు బలోపేతానికి నిర్వహిస్తున్న బడి పిలుస్తోంది కార్యక్రమాలలో భాగంగా రెండవరోజు స్థానిక బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పలు అంశాలను సంబరంగా జరుపుకున్నారు. పాఠశాల హెచ్ఎం, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత తోటకూర సాయిరామకృష్ణ అధ్యక్షతన ఆరు నుంచి 10వ తరగతి విద్యార్థులకు గణితం, సైన్స్, సోషల్ అంశాలకు చెందిన పజిల్స్ ప్రదర్శన, సామాజిక అంశాలపై చర్చ, లాజికల్ రీజనింగ్, జ్ఞాపకశక్తి తదితర అంశాలను ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ అంశాలపై రూపొందించిన ప్రశ్నలకు విద్యార్థులు చాలా ఉత్సాహంగా జవాబులు చెప్పారు. ఈ సందర్భంగా సాయి రామకృష్ణ మాట్లాడుతూ బడిఈడు పిల్లలు అందరూ మున్సిపల్ పాఠశాలల్లో చేరేలా ఇంటింటా ప్రచారం నిర్వహించి, ప్రభుత్వ పాఠశాలల ఉపయోగాలు గురించి వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎ.ఎల్.వి. కుమారి, కె. అరుణ, డి.వి.ఆర్.ఎన్. వల్లి, ఎ. శ్రీవల్లి, ఎ.పి. రాజేంద్ర కుమార్, కె..శ్రీనివాస్, జి. రమాదేవి, భద్రావతి, తదితరులు పాల్గొన్నారు.







