క్షయ నిర్మూలనకు ప్రతీ ఒక్కరూ సహకరించాలి

UPDATED 24th MARCH 2019 SUNDAY 8:00 PM

పెద్దాపురం: క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతీ ఒక్కరూ సహకరించాలని డాక్టర్ రాంబాబు నాయక్ అన్నారు. ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ రాంబాబు నాయక్ మాట్లాడుతూ రెండు వారాలకు మించి దగ్గు, సాయంత్రం జ్వరం, ఆకలి లేకపోవటం, బరువు తగ్గడం, ఛాతినొప్పి ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. వ్యాధిగ్రస్థులకు ప్రభుత్వం మందులు ఉచితంగా అందిస్తున్నట్లు వివరించారు. క్షయ అనేది భయంకరమైన వ్యాధి కాదని, ప్రాథమిక స్థాయిలోనే నియంత్రించని, దీన్ని అరికట్టేందుకు ప్రజల్లో విస్తృత ప్రచారం అవసరమన్నారు. ఈ సందర్భంగా వ్యాధి సోకకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పద్మదీపిక, టిబి సూపర్ వైజర్ ఎన్.వి.రమణ, ఎన్. రామకృష్ణ, ఆశా వర్కర్లు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us