వాషింగ్టన్ (రెడ్ బీ న్యూస్) 19 డిసెంబర్ 2021: సులభంగా వ్యాపించే గుణమున్న ఒమిక్రాన్ వేరియంట్ ప్రచండ వేగంతో ప్రపంచదేశాలను చుట్టుముడుతోందని అమెరికాలోని ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు, అమెరికా అధ్యక్షుడి ప్రధాన వైద్య సలహాదారు డాక్టర్ ఆంటోని ఫౌచీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణాలు చేయడం ఇన్‌ఫెక్షన్ ముప్పును మరింత పెంచుతుందని సూచించారు. రెండు డోసుల్లో వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ ఈ వేరియంట్‌తో బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్లు పెరిగే ప్రమాదం ఉందన్న ఆయన.. తప్పకుండా బూస్టర్ డోసు తీసుకోవాలని అమెరికన్లకు సూచించారు. కొవిడ్ తీవ్రత అధికంగా ఉన్న అమెరికాలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా హాలీడే సీజన్ కావడంతో ప్రజలు విహారయాత్రలకు ప్రాధాన్యమిస్తున్నారు. ఈ నేపథ్యంలో విస్తృత వేగంతో వ్యాపిస్తున్న ఒమిక్రాన్ వేగాన్ని కట్టడి చేయాలంటే మాస్కులు ధరించడంతోపాటు బూస్టర్ డోసు తీసుకోవాలని ఫౌచీ సూచించారు. ఒమిక్రాన్ వేరియంట్ వల్ల బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్‌లు పెరగడంలో ఎటువంటి సందేహం లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 90దేశాలకు వ్యాపించిన ఈ వేరియంట్ అమెరికాలో సగానికిపైగా రాష్ట్రాల్లో వెలుగు చూసిందని చెప్పారు. ఇదిలా ఉంటే, విస్తృత వేగంతో వ్యాపిస్తున్న ఒమిక్రాన్ తీవ్రత దక్షిణాఫ్రికా, యూరప్ దేశాల్లో అధికంగా ఉంది. ఇప్పటికే అక్కడ నిత్యం వేల సంఖ్యలో ఈ కేసులు వెలుగు చూస్తున్నాయి. అటు అమెరికాలోనూ కొత్త వేరియంట్ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. న్యూయార్క్‌లో పాజిటివిటీ రేటు 8 శాతం దాటింది. అయితే, వేగంగా వ్యాపిస్తున్నప్పటికీ ఇప్పటివరకు వ్యాధి తీవ్రత తక్కువగా కనిపిస్తుండడం కాస్త ఊరట కలిగించే విషయం.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







