UPDATED 7th FEBRUARY 2018 WEDNESDAY 7:30 PM
పెద్దాపురం: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండల పరిధిలోని గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సాగర్ జూనియర్ కళాశాల, రోటరీ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం పాఠ్య పుస్తకాలను అందచేశారు. సామాజిక సేవా కార్యక్రమాలలో భాగంగా విద్యార్థులకు ఈ పుస్తకాలను అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ కార్యదర్శి రావులపర్తి విజయ్, సాగర కళాశాల డైరెక్టర్స్ చిన్న శ్రీదేవి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.







