ఆదిత్యలో ఇసిఇ విద్యార్థులకు వర్క్ షాప్

UPDATED 10th JULY 2018 TUESDAY 6:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల నాల్గవ సంవత్సరం ఇసిఇ విభాగం  విద్యార్థులకు ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఐటి అకాడమీ, విజయవాడ ఆద్వర్యంలో నేషనల్ ఇనుస్ట్రుమెంట్స్ ల్యాబ్ వ్యూ అనే అంశంపై మూడు రోజుల వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లు ఆదిత్య క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఐటి అకాడమీ, విజయవాడ ప్రతినిధి పూజిత పాల్గొంటారని తెలిపారు. ఈ వర్క్ షాపులో ఇసిఇ విభాగాధిపతులు మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ డిజైన్ అండ్ సిమ్యులేషన్ పై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని, ఈ సాఫ్ట్ వేర్ ఉపయోగించుకొని విద్యార్థులు సొంతంగా లైవ్ ప్రాజెక్టులు అభివృద్ధి చేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇసిఇ విభాగాధిపతి ప్రొఫెసర్ జి. శ్రీదేవి, ప్రొఫెసర్ వి. సత్యనారాయణ, అధ్యాపక సిబ్బంది, కార్యక్రమం కోఆర్డినేటర్ టి. శ్రీనివాసరావు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us