జాతీయస్థాయి సదస్సులో పాల్గొన్న ఆదిత్య విద్యార్థులు

UPDATED 11th JANUARY 2019 FRIDAY 7:00 PM

గండేపల్లి: ఆదిత్య డిగ్రీ కళాశాల, ఫోరెన్సిక్ సైన్స్ విద్యార్థులు ఈ నెల తొమ్మిదవ తేదీన నాగపూర్ లో జరిగిన కార్పోరేట్ ఫోరెన్సిక్స్, మేధో సంపత్తి హక్కుల జాతీయస్థాయి సదస్సులో పాల్గొన్నట్లు ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ సుగుణారెడ్డి మాట్లాడుతూ గవర్నమెంట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్ (నాగపూర్) నిర్వహించిన ఈ సదస్సులో భాగంగా ఫోరెన్సిక్ రంగానికి సంబంధించిన అంశాలు చర్చించినట్లు తెలిపారు. కార్పోరేట్ ఫోరెన్సిక్ - ఏ న్యూ హోరిజోన్, మేధో సంపత్తి హక్కులు అనే అంశంపై డాక్టర్ రంజిత్ సింగ్, పంకజ్ బోర్కర్ సదస్సులో ప్రసంగించారని అన్నారు. ఇలాంటి అరుదైన ఫోరెన్సిక్ సదస్సులు, సమావేశాల్లో విద్యార్థులు తప్పనిసరిగా పాల్గొని తమ విజ్ఞానాన్ని పెంచుకోవాలని ఆమె విద్యార్థులను సూచించారు. ఈ సదస్సులో పాల్గొని సర్టిఫికెట్లు సాధించిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ ఇ. మోహన్ అభినందించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us