అంతర్జాతీయ బాక్సింగ్ పోటీల్లో గైట్ విద్యార్థుల ప్రతిభ

UPDATED 6th JUNE 2018 WEDNESDAY 9:00 PM

రాజానగరం: అంతర్జాతీయ ఛాంపియన్ షిప్ బాక్సింగ్ పోటీల్లో గైట్ కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు బంగారు పతకాలు సాధించినట్లు గైట్ మేనేజింగ్ డైరెక్టర్ కె. శశికిరణ్ వర్మ తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ ఇండో-నేపాల్ గుడివిల్ రూరల్ గేమ్స్ ఇంటర్నేషనల్ ఛాంపియన్ షిప్ -2018లో బాక్సింగ్ పోటీల్లో తమ కళాశాలకు చెందిన కె. జ్యోత్స్నాదేవి, టి. మనోజ్ ఆనంద్, టి. శివప్రసాద్ చక్కడి ప్రతిభ కనబర్చి బంగారు పతకాలు కైవశం చేసుకుని, ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలకు ఎంపికయ్యారన్నారు. వచ్చే నెలాఖరులో కెనడాలో ఈ పోటీలు జరుగుతాయన్నారు. ఈ సందర్భంగా విజేతలను ఆయన అభినందించారు. చైతన్య విద్యా సంస్థల చైర్మన్ కె.వి.వి. సత్యనారాయణ రాజు (చైతన్యరాజు), చైతన్య సంస్థలు సిఈవో డాక్టర్ డి.ఎల్.ఎన్. రాజు, గైట్ అటానమస్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.వి. రామ్మూర్తి, జనరల్ మేనేజర్ డాక్టర్ పి. సుబ్బరాజు మాట్లాడుతూ ప్రపంచస్థాయి బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో కూడా ఇదేవిధంగా ప్రతిభ కనబర్చాలన్నారు. గైట్ కళాశాల బాక్సింగ్ కోచ్ బి. సామ్మూల్ రాజు విజేతలను అభినందించారు. ఈ పోటీలు గత నెల 26 నుంచి 28 వరకూ నేపాల్ లోని ఖాట్మండ్ లో జరిగినట్లు కోచ్ సామ్యూల్ రాజు తెలిపారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us