యోగాతో ఒత్తిడి దూరం

UPDATED 21st JUNE 2019 FRIDAY 9:00 PM

సామర్లకోట: యోగా అనాదిగా భారతీయ ప్రజల జీవన విధానంలో ఇమిడి పోయిందని, యోగాతో శారీరక, మానసిక ప్రశాంతత ఏర్పడి మనిషి ఆరోగ్యంగా జీవించడానికి అవకాశం ఉంటుందని బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాల హెచ్ఎం తోటకూర సాయిరామకృష్ణ అన్నారు. స్థానిక అయోధ్య రామాపురంలో గల బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీఈటీ తాళ్లూరి వైకుంఠం విద్యార్థులతో యోగాసనాలు వేయించారు. అనంతరం హెచ్ఎం సాయిరామకృష్ణ మాట్లాడుతూ యోగా చేయడం వల్ల ఒత్తిడి దూరమవుతుందని, మానసిక ప్రశాంతతకు, ఆరోగ్యానికి యోగా ఒక గొప్ప ఔషధం అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎం. శ్రీనివాస్, నరేష్, రామకృష్ణ, ఉమా మహేశ్వరరావు, వరలక్ష్మి, శ్రీదేవి, వీరభద్రరావు, సుబ్రమణ్యం, తదితరులు పాల్గొన్నారు. 

సామర్లకోట మండలంలో.. 
మండల పరిధిలోని నవర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎన్.సి.సి అధికారి జివివి సత్యన్నారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో యోగాసనాలు వేయించారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిహెచ్ సత్యవతి, ఎస్ఎంసీ చైర్మన్ కంఠం శ్రీనివాస్ మాట్లాడుతూ యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని, ప్రతీ ఒక్కరూ యోగా సాధన చేయడంతో ఎలాంటి అనారోగ్యానికి గురి కాకుండా ఉంటారన్నారు. ప్రాణాయామాలు, సూర్య నమస్కారాలు, ఆసనాలు వేయడంతో మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటారన్నారు. అలాగే సామర్లకోట అర్బన్ ఐసిడిఎస్ సిడిపివో టీడీఆర్ పద్మావతి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ యోగా నిపుణురాలు సత్యవేణి అంగన్వాడీ సిబ్బందికి యోగాపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎపిడి పి. మణెమ్మ, ప్రీ స్కూల్ కన్సల్టెంట్ సుభద్ర, స్వచ్ఛ భారత్ ప్రేరక్ వినయ్ శ్రావణ్, యోగా గురువులు యార్లగడ్డ అక్కిరాజు, ఎస్. బాపిరాజు, అలేఖ్య, సూపర్ వైజర్లు సుందరి, నళిని, కృష్ణకుమారి, తదితరులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us