UPDATED 17th OCTOBER 2019 THURSDAY 9:00 PM
సామర్లకోట(రెడ్ బీ న్యూస్): రాష్ట్ర భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నుంచి రూ.18 కోట్ల 60 లక్షలు విడుదలపై సిఐటియు మండల అధ్యక్షులు బర్ల రాంపాల్, మండల భవన నిర్మాణ కార్మికుల సంఘం గౌరవ అధ్యక్షుడు బాలం శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొంతకాలంగా భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై పెద్ద ఎత్తున పోరాడిన ఫలితంగా నిధులు విడుదల చేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. గత సంవత్సరం కాలంగా సంక్షేమ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న భవన నిర్మాణ కార్మికులకు వివాహ, ప్రసూతి, సహజ, ప్రమాద మరణాలకు పరిహారాలు నిలిచిపోయాయని అన్నారు. సంక్షేమ బోర్డుకు అధికారులను నియమించకపొవడంతో నిధుల విడుదల ఆగిపోయాయని, వేలాది మంది కార్మికులు పోరాటం చేసిన ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం బ్రహ్మదేవం అధ్యక్ష, కార్యదర్శులు బాబూరావు, ఏ. తమ్మారావు, మేడపాడు అభ్యర్థులు ఏసుబాబు వేట్లపాలెం నాయకులు రాంబాబు, శ్రీనివాస్, మాధవపట్నం అధ్యక్షులు లోవరాజు, నవర అధ్యకులు రాంబాబు, కార్యదర్శి వీరబాబు, తదితరులు పాల్గొన్నారు.







