ఆదిత్యలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

UPDATED 9th MARCH 2018 FRIDAY 6:30 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం  ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి హాజరై మాట్లాడారు. ప్రతీ మనిషి జీవితంలో నలుగురు మహిళలు ప్రభావితం చేస్తారని, వారిలో తల్లి, సోదరి, భార్య, కుమార్తెలు వివిధ సందర్భాలలో మన ఉన్నతికి దోహదపడతారని అన్నారు. మన దేశంలో స్త్రీకి సమున్నత స్థానం కల్పించి ప్రతీ రంగంలో పురుషులతో సమానంగా అవకాశాలు కల్పిస్తున్నారని,  కానీ కొన్ని దేశాలలో మహిళలకు సమాజంలో గుర్తింపుకాని, ఓటు హక్కు కానీ లేదని తెలిపారు. అనంతరం ఆదిత్యలో విశేష సేవలందించిన మహిళా అధ్యాపకులు కె. దేవీప్రియ, వి. సునీత లను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్త్రీ సమానత్వం అనే అంశంపై నిర్వహించిన వక్తృత్వ పోటీల్లో విజేతలకు బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. రమాశ్రీ, విభాగాధిపతులు ప్రొఫెసర్ వానతి, ప్రొఫెసర్ జి. శ్రీదేవి, గ్రంథాలయాధికారి కె. అశోక్ కుమార్, మహిళా అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినులు, పాల్గొన్నారు.    

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us