ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి

గంగవరం (రెడ్ బీ న్యూస్) 20 డిసెంబర్ 2021: నిరుపేదల సొంతింటి కల నెరవేర్చే ఉద్దేశంతో ఎన్నో సంవత్సరాలుగా పేదలకు మంజూరు చేసిన గృహ నిర్మాణాలు అన్నింటిని ఎటువంటి రుసుము తీసుకోకుండా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం టీడీపీ మండల కమిటీ అధ్యక్షుడు పాము అర్జున ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అలాగే ఎంపీడీవో జాన్ మిల్టన్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ఓటీఎస్ ద్వారా ప్రభుత్వం నిరుపేదల నుంచి అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు డాక్టర్ తీగల ప్రభ, టి. శ్రీరాములు, టీడీపీ నాయకులు కృష్ణ, వీరబాబు సత్యవేణి, శ్యాం, విష్ణు, చిన్న, వెంకటరమణ, రాంబాబు, శాంతిరాజు, జగ్గారావు వీరభద్రా రెడ్డి, రాంబాబు, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us