కాకినాడ (రెడ్ బీ న్యూస్)13 నవంబరు 2021: కాకినాడ జేఎన్టీయూకే పీహెచ్‌డీ ప్రోగ్రాంల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు వర్సిటీ పరిశోధన అభివృద్ధి డైరెక్టర్ ప్రొఫెసర్ ఎ.గోపాలకృష్ణ తెలిపారు. ఏఐసీటీఈ డాక్టోరల్ ఫెలోషిప్ పథకం కింద ఈ ఫుల్‌టైం ప్రోగ్రాంను నిర్వహిస్తున్నారన్నారు. దీని వ్యవధి మూడేళ్లు ఉంటుందని, నిబంధనల మేరకు మరో ఏడాది పొడిగించే వీలుందని, దీనిలో మొత్తం 8 సీట్లు ఉంటాయని తెలిపారు. సివిల్, ఎలక్ర్టికల్ ఎలకా్ట్రనిక్స్, మెకానికల్, ఎలకా్ట్రనిక్స్ కమ్యూనికేషన్, కంప్యూటర్‌సైన్స్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్లు ఉన్నాయన్నారు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంనుంచి సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో డిగ్రీ, పీజీ పూర్తి చేసి ఈ రెండింటిలోను కనీసం 70శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలన్నారు. దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 65శాతం మార్కులు ఉంటే చాలని, పీహెచ్‌డీలో ప్రవేశం పొందేందుకు అభ్యర్థులకు 30 ఏళ్లు మించకూడదని అన్నారు. అభ్యర్థులకు మొదటి రెండేళ్లు రూ.31,000, చివరిఏడాది నెలకు రూ.35,000 ఫెలోషిప్ ఇస్తారని కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు హెచ్‌ఆర్‌ఏ కూడా ఇస్తారని, కంటింజెన్సీ గ్రాంటు కింద రూ.15,000 చెల్లిస్తారని అన్నారు. ఈనెల 20లోపు దరఖాస్తు చేసుకోవాలని, వివరాలను వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







