ఘనంగా డాక్టర్ లక్ష్మారెడ్డి జయంతి వేడుకలు

UPDATED 10th JULY 2018 TUESDAY 9:00 PM

రాజానగరం: కెఎల్ఆర్ లెనోరా దంత వైద్య కళాశాల, ఆసుపత్రి వ్యవస్థాపకుడు డాక్టర్ కె. లక్ష్మారెడ్డి 51వ జయంతి వేడుకలను కళాశాల ఆవరణలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన విగ్రహానికి డైరెక్టర్లు జి. నాగార్జునరెడ్డి, ఎ. ప్రసాద్ చౌదరి, ప్రిన్సిపాల్ డాక్టర్ విశ్వప్రకాష్ శెట్టి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతీ ఒక్కరికీ విద్య, వైద్యం అందించాలన్న దృఢ సంకల్పంతో ఆయన ఉభయ రాష్ట్రాల్లో పలు విద్యా సంస్థలు, ఆసుపత్రులు స్థాపించారని, అభివృద్ధికి శక్తివంచన లేకుండా అహర్నిశలు శ్రమించి మహాశక్తిగా ఎదిగారన్నారు. అలాగే ఎంతోమందికి ఉపాధి కల్పించడంతో పాటు ప్రజల ఉన్నతికి యెనలేని కృషి చేశారని ఆయన సేవలను కొనియాడారు. అనంతరం కేకును కట్ చేసి అందరికీ పంచారు. అలాగే దుస్తులు పంపిణీతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ దాల్ సింగ్, సి.ఎఫ్.వో సి.హెచ్. సాగర్ రెడ్డి, ఏవో అనురాధ, వివిధ విభాగాల అధిపతులు, వైద్యులు, తదితరులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us