గైట్ లో టెట్ పరీక్షా కేంద్రం ఆకస్మిక తనిఖీ

UPDATED 11th JUNE 2018 MONDAY 6:30 PM

రాజానగరం: స్థానిక గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (గైట్) కళాశాలలో ఏర్పాటు చేసిన టెట్ ఆన్ లైన్ పరీక్షా కేంద్రాన్ని బొమ్మూరు డైట్ కళాశాల ప్రిన్సిపాల్, పరీక్షా పరిశీలకులు ఎన్.ఆర్. సుబ్రహ్మణ్యం సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రంలో డిపార్ట్ మెంట్ అధికారి ఎంఇవో కె. హెచ్. నాయక్ పరీక్షా కేంద్రానికి సంబంధించిన సమాచారాన్ని వివరించారు. సోమవారం రెండు పూటలా జరిగిన ఈ టెట్ పరీక్షకు 400 మంది అభ్యర్దులకుగాను 377 మంది అభ్యర్థులు హాజరయ్యారని, ఉదయం జరిగిన పరీక్షకు 200 మంది అభ్యర్థులకుగాను 189 మంది, మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 200 మందికి 188 మంది అభ్యర్థులు హాజరయ్యారని ఆయన తెలిపారు.            

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us