ఓటుహక్కు వినియోగంపై విస్తృత ప్రచారం

UPDATED 19th FEBRUARY 2019 TUESDAY 8:00 PM

పెద్దాపురం: ఎన్నికల ప్రక్రియలో విశ్వసనీయత, పారదర్శకతకు పెద్దపీట వేసేందుకే ఈవీఎంలని విఆర్వో నూతలపాటి లోవరాజు అన్నారు. ఈవీఎంల పనితీరు, ఈవిఎంలపై ఓటు వేసే విధానంపై పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామంలో మంగళవారం అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణ ఖచ్చితమైన నమ్మకానికి ప్రతిరూపంగా ఉండేందుకు వీవీప్యాట్‌లను అందుబాటులోకి తెచ్చిందని, వీటిపై పోలింగ్‌ కేంద్రాలు, పాఠశాలలు, కళాశాలల్లో అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ రీపోలింగ్‌కు ఆస్కారం లేకుండా ఉండేందుకు వీవీప్యాట్‌ యంత్రాలు దోహదపడతాయని అన్నారు. ఈ సందర్భంగా వివి ప్యాట్ ఓటర్లు వెరిఫికేషన్ పేపర్ ఆడిట్ ట్రైలర్ పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఓటు ఎలా వేయాలో, అలాగే ఈవిఎం పరికరంలో ఓటర్లు తమ ఓటును ఎవరికి వేశారన్నది తెలుసుకునే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎస్. వెంకటరమణ,  మాస్టర్ ట్రైనీ మూర్తి, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us